Share News

Hyderabad: మ్యాక్సివిజన్ ఆస్పత్రిని ప్రారంభించిన రఘురామకృష్ణం రాజు

ABN , Publish Date - Sep 16 , 2025 | 09:12 PM

మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతంలో 13వ బ్రాంచ్‌ను ప్రారంభించింది. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Hyderabad: మ్యాక్సివిజన్ ఆస్పత్రిని ప్రారంభించిన రఘురామకృష్ణం రాజు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 : మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ హైదరాబాద్‌లోని కొంపల్లి ప్రాంతంలో 13వ బ్రాంచ్‌ను ప్రారంభించింది. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, కో -చైర్మన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామ.. హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు కొత్త మైలురాయి ఈ ఆస్పత్రి అని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రి కేంద్రాన్ని ప్రారంభించడంచ చాలా సంతోషంగా ఉందని చెప్పారు.


Maxivision-2.jpg

నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొంపల్లి ప్రాంతంలో మాక్సివిజన్ 13వ కేంద్రాన్ని ప్రారంభించడం.. ప్రజా సంక్షేమం, ప్రగతిశీల వైద్య సేవలపట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. కంటి ఆరోగ్యం మొత్తం శ్రేయస్సులో కీలకమైన అంశంగా పేర్కొన్నారు రఘురామ. అధిక నాణ్యత కలిగిన వైద్య సదుపాయాలను స్థానికంగా మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలనే మాక్సివిజన్ నిర్ణయం వేలాది మంది జీవితాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందన్నారు. అత్యాధునిక సౌకర్యాలు, నిపుణుల బృందాలు, రోగికి ప్రాధాన్యత అనే సిద్దాంతంతో, భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రమాణాలను మాక్సివిజన్ పెంచుతూనే ఉందని చెప్పుకొచ్చారు రఘురామ. ఈ హాస్పిటల్ సెంటర్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, ఆస్పత్రి బృందానికి రఘురామకృష్ణం రాజు అభినందనలు తెలియజేశారు.

Updated Date - Sep 16 , 2025 | 09:12 PM