Share News

Akhanda 2 Ticket Rates: అఖండ 2 టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే.?

ABN , Publish Date - Dec 10 , 2025 | 09:50 PM

అఖండ 2 సినిమా ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల పాటు ఈ అవకాశం కల్పించింది. సినిమా టికెట్ ధరల వివరాలు ఎలా ఉంటాయంటే.?

Akhanda 2 Ticket Rates: అఖండ 2 టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంతంటే.?
Akhanda 2

ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 12న అఖండ 2(Akhanda 2 Release Date) సినిమా కోసం.. టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అనుమతినిచ్చింది. ఈ సినిమా ప్రత్యేక షో కోసం రూ.600 టికెట్ ధరలను పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12 నుంచి 14 వరకూ ఈ వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షో బుకింగ్స్ గురువారం ఓపెన్ కానున్నట్టు తెలుస్తోంది.


ఇక, అఖండ 2(Akhanda 2) సినిమా కోసం.. సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ రూ.50 పెంపునకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రూ.100 చొప్పున పెంచుకోవచ్చని పేర్కొంది. మూడు రోజుల పాటు పెంచిన ధరలు కొనసాగింపు ఉంటుందని తెలిపింది. అయితే.. పెరిగిన ఆదాయంలో 20 శాతం కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఆదేశించింది. ఈ సొమ్మును టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(TFIEWA) ఖాతాకు తప్పనిసరిగా చెల్లించాలని స్పష్టం చేసింది.


ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో లియోనెల్ మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ వివరాలివే..

పెళ్లి చేస్తామని నమ్మించి, ఇంటికి పిలిపించి.. యువకుడు దారుణ హత్య.!

Updated Date - Dec 10 , 2025 | 09:51 PM