Share News

Hyderabad: భర్తను ఫాలో అయిన భార్య.. అతను చేసిన పనికి షాక్.. ట్విస్ట్ నెక్ట్స్ లెవల్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:05 PM

భర్త గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది. దీంతో అతడిపై నిఘా పెట్టింది. అసలు ఎందుకు దూరంగా ఉంటున్నాడు ? అని అతడిని ఫాలో అయింది. తీరా అసలు విషయం తెలుసుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

Hyderabad: భర్తను ఫాలో అయిన భార్య.. అతను చేసిన పనికి షాక్.. ట్విస్ట్ నెక్ట్స్ లెవల్..

హైదరాబాద్ : విద్యాబుద్ధులు నేర్పే ఓ టీచర్.. పెళ్లి అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో అతడు తన కుటుంబంను దూరం పెడుతూ వచ్చాడు. అనుమానం వచ్చిన భార్య అతడిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్త ప్రశాంత్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ టీచర్‌ను భార్య తీవ్ర ఆగ్రహానికి లోనై చితకబాదింది. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో చోటు చేసుకుంది.


భర్త గత కొద్ది నెలలుగా ఇంటికి రాకుండా ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని నిలదీసింది. తీరా ఫోన్ లాక్కొని చూడగా అసలు విషయం బయటపడింది. ఫోన్‌లో ఛాటింగ్ లు చూసి షాక్ అయిన భార్య శ్వేత తన కుటుంబ సభ్యులతో టీచర్ వాణి ఇంటికి వచ్చి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మహిళను భయంకరంగా చితకబాదింది. భయంతో భర్త ప్రశాంత్ గోడ దూకి పరారయ్యాడు. ఆ వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులను వ్యాపారంలో పెడతా అని చెప్పి 30 లక్షల రూపాయలు, కారు, స్కూటీ, బంగారం తీసుకుని వెళ్లిన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకి ఇచ్చాడని భార్య ఆరోపిస్తోంది. తనకి న్యాయం చేయాలని పోలీసులకు పిర్యాదు చేసింది బాధితురాలు.


Also Read:

హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..

ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Updated Date - Mar 05 , 2025 | 01:44 PM