Hyderabad road naming: హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌కు ట్రంప్ పేరు.. బీజేపీ విమర్శలు..
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:28 AM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రహదారిని ఇకపై 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పిలవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది (Donald Trump India).
హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలనే ప్రతిపాదన గురించి కేంద్ర విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది మాత్రమే కాదు.. హైదరాబాద్‌లోని కీలక రహదారులకు పలువురు ప్రముఖుల, సంస్థల పేర్లను ఖరారు చేశారు. రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డును కలిపే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టనున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ నిర్మిస్తున్న భారీ క్యాంపస్ సమీపంలోని రహదారికి 'గూగుల్ స్ట్రీట్' అని నామకరణం చేయనున్నారు. (Trump road controversy).
హైదరాబాద్‌లోని ముఖ్యమైన రోడ్లకు ప్రపంచస్థాయి కార్పొరేషన్ల పేర్లు పెడతామని సీఎం ప్రకటించారు (Telangana government decision). దానికి అనుగుణంగానే సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, సీఎం నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చాలనుకుంటే చరిత్రను, వారసత్వాన్ని గుర్తు చేసేలా పేర్లు పెట్టాలని, అంతే తప్ప ఎవరు ట్రెండింగ్‌లో ఉంటే వారి పేరు పెట్టాలనుకోవడం సరికాదని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్