Share News

Hyderabad: మెక్‌-సేవక్‌, మెక్‌ నిరీక్షక్‌!

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:39 AM

హైదరాబాద్‌ పరిసరాల్లోని పరిశ్రమల్లో ఇటీవల సంభవించిన ఘోర ప్రమాదాలు ఎంతో విషాదాన్ని మిగిల్చాయి. ఆయా పరిశ్రమల్లోని యంత్రాల్లో తలెత్తే లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతుంటాయి.

Hyderabad: మెక్‌-సేవక్‌, మెక్‌ నిరీక్షక్‌!

  • యంత్రాల్లోని లోపాలను చెప్పే పర్యవేక్షక వ్యవస్థలు

  • హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీ పరిశోధకుల ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పరిసరాల్లోని పరిశ్రమల్లో ఇటీవల సంభవించిన ఘోర ప్రమాదాలు ఎంతో విషాదాన్ని మిగిల్చాయి. ఆయా పరిశ్రమల్లోని యంత్రాల్లో తలెత్తే లోపాల వల్లే ప్రమాదాలు జరుగుతుంటాయి. అయి తే వాటిని నివారించేందుకు మానవ వనరుల ప్రమేయాన్ని తగ్గిస్తూ తక్కువ ఖర్చులో యంత్రాలపై ని రంతర పర్యవేక్షణ ఉండేలా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంస్‌ఎంఈ) కోసం మెక్‌- సేవక్‌, మెక్‌ నిరీక్షక్‌ పేరిట రెండు పర్యవేక్షక వ్యవస్థలను హైదరాబాద్‌లోని బిట్స్‌పిలానీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘యంత్రాయుష్‌’ పేరిట ప్రారంభించిన స్టార్టప్‌తో ఈ వ్యవస్థలకు అంకురార్పణ చేశారు.


ఏడాది కష్టం, వందలాది ప్రయత్నాల ఫలితం

మెక్‌సేవక్‌, మెక్‌ నిరీక్షక్‌ వ్యవస్థల అభివృద్ధి కోసం ఏడాది క్రితం యంత్రాయుష్‌ స్టార్ట్‌పను ప్రారంభించారు. హైదరాబాద్‌, బిట్స్‌ పిలానీలోని డిపార్ట్‌మెం ట్‌ ఆఫ్‌ మెకానికల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీ సభ్యులు ప్రొఫెసర్‌ జీఆర్‌ శబరీష్‌, రాధిక నేతృత్వంలోని పరిశోధకుల బృందం వందలాది ప్రయత్నాల తర్వాత ఈ వ్యవస్థల ప్రొటోటై్‌పలను అభివృద్ధి చేసింది. టెక్నాలజీ బిజినెస్‌ ఇక్యుబేటర్‌, బయోసిటీ ఫౌండేషన్ల మద్దతుతో ఈ రెండు వ్యవస్థలను పూర్తిగా అభివృద్ధి చేసి పరీక్షించింది. ఇందులో మెక్‌సేవక్‌.. తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమీకరించి ఒకే తరహా యంత్రాన్ని పర్యవేక్షిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఉదాహరణకు ఏదైనా ఒక పంపును తీసుకుంటే.. అదే తరహా అనేక పంపులను కూడా మెక్‌ సేవక్‌ పర్యవేక్షిస్తుందని యంత్రాయుష్‌ బృందం చెబుతోంది. మెక్‌ సేవక్‌ ముందుగానే లోపాలను గుర్తిస్తుందని, దాని వల్ల మెకానిక్‌లు అత్యంత క్లిష్టమైన ప్రక్రియలను చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అదే మెక్‌ నిరీక్షక్‌.. ఒకేసారి విభిన్న యంత్రాలను పర్యవేక్షిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ రెండు వ్యవస్థలు కృత్రిమ మేధ సాయంతో పని చేస్తాయని శబరీష్‌ వెల్లడించారు. ఈ వ్యవస్థలతో రసాయన పరిశ్రమల్లోని యంత్రాల్లో లోపాలను గుర్తించవచ్చన్నారు. ఈ మెక్‌సేవక్‌, మెక్‌ నిరీక్షక్‌ ఖర్చు తక్కువని.. సేవక్‌కు రూ.30-35 వేలు, నిరీక్షక్‌కు రూ.లక్ష దాకా వ్యయం అవుతుందన్నారు. ఈ రెండు వ్యవస్థలను రిమోట్‌గా వినియోగించుకోవచ్చునని చెప్పా రు. ఈ వ్యవస్థలను మెరుగుపర్చి వచ్చే ఏడాది ఫిబ్రవరికి అందుబాటులోకి తెస్తామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 04:39 AM