Hyderabad: నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Oct 25 , 2025 | 07:23 AM
టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్ పరిధిలో ఫీడర్ నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
హైదరాబాద్: టీజీఎస్పీడీసీఎల్ వసంతనగర్ సెక్షన్(TGSPDCL Vasanthanagar Section) పరిధిలో ఫీడర్ నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీసీఐడీ కాలనీ, ఎన్‌ఆర్‌ఎస్ఏ కాలనీ, ఎస్‌ఎస్ కాలనీ, హైదర్‌నగర్ మెయున్ రోడ్డు, ధర్మారెడ్డి ఫేజ్-2 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
మైహోం ఫీడర్ పరిధిలో..
అల్లాపూర్: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని అల్లాపూర్ ఏఈ రాకేష్ గౌడ్ తెలిపారు. అయ్యప్ప సొసైటీ సబ్ స్టేషన్ 11 కేవీ మైహోం ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. సీజీఆర్ స్కూల్ నుంచి బిర్యానీ టైమ్స్ రెస్టారెంట్ వరకు విద్యుత్ సరఫర ఉండదన్నారు.
విద్యుత్ ఉండని ప్రాంతాలు..
హయత్‌నగర్: కమ్మగూడ 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫీడర్ పరిధిలోని కమ్మగూడ ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీ, సంపద హోమ్స్, న్యూ సుభాష్ నగర్ కాలనీ, గణే్‌షనగర్-3, రాజ్‌రంజిత్ కాలనీ, టీచర్స్ కాలనీ, ఏపీఏటీ కాలనీ, డీఎల్‌ఆర్‌ఎల్, శ్రీనగర్ కాలనీ, మస్కతి ప్రాంతం, వెంకటేశ్వరకాలనీ, అన్నపూర్ణా కాలనీ, వీరమణి బిస్కెట్ కాలనీలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఇంజాపూర్ సబ్ స్టేషన్ ఏఈ రాములు తెలిపారు.
కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్, గ్రీన్‌పార్క్, అశోక్ కాలనీ, రామ్‌దా్‌సనగర్, శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ, స్కందగిరి ఎన్‌క్లేవ్, సాయిలీల ఎన్‌క్లేవ్, శ్రీలక్ష్మీ ఎన్‌క్లేవ్ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు సైనిక్‌పురి సబ్‌స్టేషన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు.
మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో..
కైలాసగిరి ఫీడర్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ, నవోదయనగర్, రాజీవ్‌నగర్, ఇందిరానగర్, భక్షిగూడ, చైతన్యనగర్ పరిసర ప్రాంతాలలో శనివారం మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని మౌలాలి సబ్ స్టేషన్ ఏఈ వెంకట్‌రెడ్డి తెలిపారు.
రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో..
రామంతాపూర్: రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గోఖలేనగర్ ఫీడర్‌లోని ప్రగతి నగర్, డిమార్ట్ వెనుక వీధి, ఇందిరానగర్, క్రోమా బిల్డింగ్, చర్చి కాంపౌండ్, గణే్‌షనగర్ ఫీడర్‌లోని మెయిన్ రోడ్డు, పాత రామంతాపూర్, శారదానగర్, సీడీటీఐ, సీఎ్‌ఫఐఎల్ ప్రాంతాలలో ఈనెల 25న శనివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని ట్రాన్స్‌కో ఏఈ కూతాడి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత..
బౌద్ధనగర్: చెట్ల కొమ్మలు నరికివేత, వివిధ మరమ్మతులు కారణంగా జామై ఉస్మానియా ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం గంట పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని విద్యానగర్ ఏఈ రోచిత తెలిపారు. జామై ఉస్మానియా, ఎస్‌బీహెచ్ కాలనీ, బౌద్ధనగర్ బాలాజీ స్కూల్ ఏరియా, అంబర్‌నగర్, లలితానగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 11 వరకు సరఫరాను నిలిపివేస్తున్నామని తెలిపారు.
విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు..
నిజాంపేట: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌లోని 11కేవీ ఫీడర్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏఈ డి. రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేటీఆర్ కాలనీ, మయూరి నగర్, బృందావన్ హిల్స్, ప్రశాంతిహిల్స్, మధురానగర్ ఫేజ్-1,2, బృందావన్ కాలనీలలో విద్యుత్ ఉండదన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతిహిల్స్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, మధురానగర్ (ఎన్టీఆర్ కాలనీలోని భాగం), శ్రీనివాస కాలనీ, తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, ఈ విషయంలో తమ సిబ్బందికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
మియాపూర్: మదీనగూడ సబ్‌స్టేషన్ మెయిన్‌టెనెన్స్ సందర్భంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనప్రియ వెస్ట్ సిటీ, కృష్ణసాయి ఎన్‌క్లేవ్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైడియా కాలనీ, చిరంజీవి నగర్, అమన్‌కాలనీ, టాకీటౌన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
ఆదిత్యనగర్ ఫీడర్ పరిధిలో..
హైదర్‌నగర్: ఆదిత్యనగర్ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తులసీనగర్, హెచ్‌ఎంటీహిల్స్ కాలనీ, భాగ్యనగర్ ఫేజ్-3, ఆదిత్యనగర్, శుభోదయ కాలనీలో విద్యుత్ ఉండదన్నారు. ఎల్లమ్మబండ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహంకాళి నగర్, శంషిగూడ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.
పీజేఆర్‌నగర్ ఫీడర్ పరిధిలో..
రాయదుర్గం: పీజేఆర్‌నగర్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళా మండలి, గాయత్రి నెస్ట్, ఆర్‌టీటీసీ, టెలికాంనగర్‌లో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News