Share News

Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN , Publish Date - Jul 10 , 2025 | 07:07 AM

బంజారాహిల్స్‌(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి  విద్యుత్‌ సరఫరా బంద్..

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: బంజారాహిల్స్‌(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ అక్బర్‌ ఫామ్‌, గ్రీన్‌ బావర్చి హోటల్‌, అంబేడ్కర్‌ కాలనీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ శాలివాహననగర్‌, జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో...

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌ సింగ్‌ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 11కేవీ భరత్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఏడీఈ విజ్ఞప్తి చేశారు.


city1.2.gif

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో గురువారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్‌ తెలిపారు. ఆర్టీసీక్రా్‌సరోడ్‌, ఎర్రమంజిల్‌,నాసర్‌ స్కూల్‌ పరిధుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, లేపాక్షి, ఐసీ క్వార్టర్స్‌, కేర్‌ ఆస్పత్రి పరిధుల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఆజామాబాద్‌ పరిధిలో 3.30 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఏఎస రావునగర్‌: 11కేవి జై జవాన్‌ కాలనీ, సాయిబాబా టెంపుల్‌, జమ్మిగడ్డ, సైనిక్‌పురి, రుక్మిణిపురి, విజయపురి, శ్రీరాంనగర్‌, సాధనా విహార్‌ ఫీడర్‌లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా గురువారం ఆ ఫీడర్‌ల పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాలో కోత విఽధిస్తున్నట్లు కుషాయిగూడ ఆర్‌.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శనగర్‌, జిఆర్‌రెడ్డినగర్‌, దేవీనగర్‌, బీజేఆర్‌నగర్‌, జై జవాన్‌ కాలనీ, మారుతీనగర్‌, న్యూ శ్రీనివాసనగర్‌, సాకేత్‌టవర్స్‌, తిరుమలహార్మోని, మాపిల్‌ హోమ్స్‌, అశోక్‌మనోజ్‌ ఎన్‌క్లేవ్‌, రాజరాజేశ్వరీ కాలనీ, ల్యాండ్‌మార్క్‌, జ్యోతి బిల్డర్స్‌, పద్మావతికాలనీ, కుషాయిగూడ బస్టాండ్‌ ఏరియా, పోచమ్మ టెంపుల్‌, సైనిక్‌పురి-ఈసెక్టార్‌, వాయుపురి, శ్రీనివాస నగర్‌, అరుల్‌ కాలనీ, నయాక్రాంతినగర్‌ తదితర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అయోధ్యనగర్‌, ఈశ్వరీపురి, సైనిక్‌పురి, విజయపురి, రుక్మిణీపురి, శ్రీరాంనగర్‌, గాంధీనగర్‌, బాలాజీఎన్‌క్లేవ్‌, ఆదిత్యనగర్‌, రాందాసునగర్‌, లక్ష్మీఎవెన్యూ, అరుల్‌కాలనీ, శ్రీనివాసనగర్‌, సంఘమిత్ర ఎన్‌క్లేవ్‌, కట్టమైసమ్మ కాలనీ, సాధనావిహార్‌ కాలనీ, కేసీఆర్‌ కాలనీ, వీఎన్‌రెడ్డి నగర్‌, భాగ్యనగర్‌ కాలనీ, హనుమాన్‌ నగర్‌, కుషాయిగూడ విలేజ్‌, మార్కెట్‌, తదితర కాలనీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోత విధిస్తున్నట్లు తెలిపారు.


ఉప్పల్‌ సెక్షన్‌లో..

ఉప్పల్‌: చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల కారణంగా గురువారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఉప్పల్‌ సెక్షన్‌ ఏఈ నిఖిల్‌ తెలిపారు. కళ్యాణపురి ఫీడర్‌ పరిధిలోని బ్యాంక్‌ కాలనీ, ఇందిరా నగర్‌, అంబేడ్కర్‌ నగ ర్‌, సీతారాం కాలనీ, ఈస్ట్‌ అండ్‌ నార్త్‌ కళ్యాణపురి, బాలాజీ ఎన్‌క్లేవ్‌, రాఘవేంద్ర కాలనీ, టీచర్స్‌ కాలనీ, అజ్మత్‌ నగర్‌, విస్తారా ఎన్‌క్లేవ్‌లలో ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అండదన్నారు. అదే విధంగా వెంకటేశ్వర టెంపుల్‌ పీడర్‌ పరిధిలోని గుడి వీధి, సెవన్‌ హి ల్స్‌ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి కాలనీ, శ్రీనగర్‌లలో మధ్యా హ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిలిపివేస్తామని, విద్యుత్‌ వినియోగదారులు తమ సిబ్బందితో సహకరించాలని ఆయన కోరారు.


గాజులరామారం: బాలయ్యనగర్‌, ఉషాముళ్లపూడి 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ మరమ్మతులు, చెట్లకొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ చైతన్యభార్గవ్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహదేవపురం వార్డు ఆఫీస్‌ లైన్‌, గణేష్‌ టెంపుల్‌ లైన్‌, మహదేవపురం చౌరస్తా, బాలయ్యనగర్‌, కమలమ్మకాలనీ, ఎస్‌ఎస్‌ మోటర్స్‌ లేన్‌, రావి నారాయణరెడ్డినగర్‌, శ్రీరామచంద్రనగర్‌, దేవేందర్‌నగర్‌, గౌతమి స్కూల్‌ లైన్‌, తహసీల్దార్‌ కార్యాలయం పరిసరాల్లో కరెంట్‌ ఉండదన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడామిస్త్రీనగర్‌, అలీ హాజీ మసీద్‌ లేన్‌, జహంగీర్‌ బస్తీ, సిక్కుల బస్తీ, ఆర్‌ఎస్‌ నగర్‌ లేన్‌, కట్టెలమండి, వల్లభాయి పటేల్‌ నగర్‌, కృష్ణవేణి స్కూల్‌, వివేకానందనగర్‌, శ్రీనివాస్‌నగర్‌ల్లో విద్యుత్‌ను నిలిపి వేస్తామని ఏఈ తెలిపారు.


కొంపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో..

పేట్‌బషీరాబాద్‌: మరమ్మతుల కారణంగా గురువారం కొంపల్లి సబ్‌-స్టేషన్‌ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోచమ్మగడ్డ, హైవే రోడ్డు, సాయికృప అపార్టుమెంట్స్‌, శ్రీకాంత్‌రెడ్డి గోదామ్స్‌, వెంకట్‌రెడ్డి గోదామ్స్‌, కావేరి డయోగ్నస్టిక్‌ కాంప్లెక్స్‌, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌, కొంపల్లి గ్రామం పరిసరాల్లో కరెంట్‌ ఉండదన్నారు. అలాగే, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫ్రెండ్స్‌ హోటల్‌, రిలయన్స్‌ పెట్రోల్‌బంక్‌, ఆర్కే ఆస్పత్రి, జీబీఆర్‌ క్లబ్‌, సాయిసిద్దార్థ ఆస్పత్రి లేన్‌, హైటెక్‌ నర్సరీ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని ఏఈ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2025 | 07:07 AM