Share News

Minister Seethakka: మా కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం: సీతక్క

ABN , Publish Date - Oct 28 , 2025 | 09:46 PM

. బైపోల్ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా సీతక్క విస్తృతంగా పర్యటించారు. నవీన్ యాదవ్‌‌ను పదే పదే రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్లు అనడం కరెక్ట్ కాదని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

 Minister Seethakka: మా కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం: సీతక్క
Minister Seethakka

హైదరాబాద్, అక్టోబర్ 28: జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పక్కా లోకల్ వ్యక్తి అని.. ఆయన గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు. బైపోల్ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా సీతక్క విస్తృతంగా పర్యటించారు. నవీన్ యాదవ్‌(Naveen Yadav)ను పదే పదే రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్లు అనడం కరెక్ట్ కాదని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో.. రెండేళ్లలో తామేం చేశామో ప్రజలకు అంతా తెలుసని అన్నారు. మరోసారి తమ కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అంటే ఊరుకునే ప్రసక్తే లేదని.. దంచికొడతామని సీతక్క స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.


జూబ్లీహిల్స్​ ఉపఎన్నిక ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అన్ని డివిజన్ లలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రతి డివిజన్‌లలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఇప్పటికే మంత్రులు ప్రచారం నిర్వహిస్తుండగా.. తాజాగా మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​యాదవ్‌ గెలుపును కాంక్షిస్తూ ప్రచారం మొదలుపెట్టారు. పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొడుతూ తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించనున్నారు.


ఇవి కూడా చదవండి:

Deputy CM Bhatti Vikramarka: వచ్చే ఏడాది నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభం: భట్టి

Jubilee Hills By Election: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ రిచెస్ట్ ప్లేసే కానీ.. ఎంపీ ఈటల

Updated Date - Oct 28 , 2025 | 10:06 PM