Share News

llegal Trade Sperm Donation: ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ సెంటర్‌ సీజ్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:50 AM

హైదరాబాద్‌లో పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి అహ్మదాబాద్‌కు తరలిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్న ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ క్లినిక్‌ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు.

llegal Trade Sperm Donation: ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ సెంటర్‌ సీజ్‌

  • పోలీసుల సమక్షంలో అధికారుల తనిఖీలు, తాళం

  • ఎనిమిది మంది అరెస్టు

  • హైదరాబాద్‌లో ఘటన

అడ్డగుట్ట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి అహ్మదాబాద్‌కు తరలిస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్న ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ క్లినిక్‌ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. పంకజ్‌ సోని అనే వ్యక్తి ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ కేంద్రాన్ని సికింద్రాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఏజెంట్ల సాయంతో డబ్బు ఎరగా వేసి పురుషుల నుంచి వీర్యం, మహిళల నుంచి అండాలను సేకరిస్తున్నారు. వీటిని అహ్మదాబాద్‌ లోని ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తున్నారు. కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఇటీవల సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు.. పంకజ్‌ సోని సహా ఏడుగురిని అరెస్టు చేశారు.


ఈ క్రమంలో పోలీసుల సమక్షంలో మంగళవారం క్లినిక్‌లో సోదాలు నిర్వహించిన వైద్య అధికారులు క్లినిక్‌ను సీజ్‌ చేశారు. కాగా, అహ్మదాబాద్‌లో ఉన్న ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ బ్యాంక్‌ లైసెన్సుతోనే సికింద్రాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌కు రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:50 AM