Hyderabad: బెట్టింగ్‌తో అప్పులపాలై.. డ్రగ్స్ దందాలోకి
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:31 AM
బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యాపారి... అర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు డ్రగ్స్ దందాలోకి దిగాడు.
డ్రగ్స్ విక్రయిస్తుండగా హైదరాబాద్‌లో ప్లాస్టిక్ వ్యాపారి అరెస్ట్
అతని వద్ద నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యాపారి... అర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు డ్రగ్స్ దందాలోకి దిగాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉండే ఝావర్ కిషన్ గోపాల్ (27) ప్లాస్టిక్ వ్యాపారి. బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో స్నేహితుల సూచన మేరకు ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ తెచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
ముంబైలో ఓ నైజీరియన్‌ను సంప్రదించి.. అక్కడకు వెళ్లాడు. అతడి నుంచి కొకైన్, ఎండీఎంఏ కొని నగరానికి తిరిగొచ్చాడు. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా కస్టమర్లకు డ్రగ్స్ విక్రయిస్తుండగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మాసబ్‌ట్యాంక్ పోలీసులు కలిసి గోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 30 గ్రాముల కొకైన్, 6 గ్రాముల ఎండీఎంఏ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.