Share News

Hyderabad: నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:46 AM

12వ డివిజన్‌లో ఉన్న ఇందిరమ్మ కాలనీ ఫేజ్‌-2లో రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, ఆక్రమణలను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చేశారు. ఇందిరమ్మ కాలనీలో కొందరు రహదారులను ఆక్రమించి అపార్ట్‌మెంట్‌ ర్యాంపుల ముందు రోడ్డుపైకి జరిగి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు.

Hyderabad: నిజాంపేటలో హైడ్రా కూల్చివేతలు

ఇందిరమ్మ కాలనీలో రోడ్డు ఆక్రమణల తొలగింపు

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు

ఉద్రిక్తతల మధ్యే ఆక్రమణలను తొలగించిన అధికారులు

నిజాంపేట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. నిజాంపేట కార్పొరేషన్‌లో ఆక్రమణలను కూల్చివేశారు. 12వ డివిజన్‌లో ఉన్న ఇందిరమ్మ కాలనీ ఫేజ్‌-2లో రహదారులను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, ఆక్రమణలను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చేశారు. ఇందిరమ్మ కాలనీలో కొందరు రహదారులను ఆక్రమించి అపార్ట్‌మెంట్‌ ర్యాంపుల ముందు రోడ్డుపైకి జరిగి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. మరికొందరు మొక్కల కోసం ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసి ఐరన్‌ ఫ్రేమ్‌ మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు కూడా కార్పొరేషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు స్పందించలేదు. ఈ ఆక్రమణల కారణంగా ఇందిరమ్మ కాలనీ మీదుగా మియాపూర్‌ వైపు రాకపోకలు సాగించడానికి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ విషయమై బాలాజీహిల్స్‌, కేటీఆర్‌ కాలనీ వాసులు హైడ్రాకు రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అధికారులు అప్పట్లోనే కాలనీలను సందర్శించి ఆక్రమణలను రెండు నెలల్లో తొలగించాలని ఆదేశించారు. అయినా ఆక్రమణదారులు పట్టించుకోలేదు. దీంతో హైడ్రా కమిషనర్‌ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది, బాచుపల్లి పోలీసులు, మునిసిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సంయుక్తంగా మంగళవారం ఆక్రమణలను తొలగించారు.


నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారు?

హైడ్రా అధికారులపై ఇందిరమ్మ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. తమ కాలనీలో కూల్చుతున్నట్లుగా పక్కన కాలనీల్లోనూ కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు. తాము గత 20 ఏళ్లుగా ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నామని, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నామని, వాటిని తొలగించాలని పక్క కాలనీల వాసులు తమపై కక్ష కట్టారని వాపోయారు. తమ దుకాణాలను కూల్చి, జీవితాలను ఆగం చేయొద్దంటూ పోలీసులు, హైడ్రా అఽధికారులను వేడుకున్నారు. కాలనీ వాసులంతా ఏకమై మియాపూర్‌ నుంచి వచ్చే రోడ్డును పూర్తిగా బంద్‌ చేశారు. కేటీఆర్‌ కాలనీ, బాలాజీ హిల్స్‌ వారి వాహనాలు ఎలా పోతాయంటూ అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఒకదశలో పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనలు కొనసాగుతుండగానే హైడ్రా సిబ్బంది కూల్చివేతలను పూర్తి చేశారు.


ఇవి కూడా చదవండి

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 03:46 AM