Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:31 PM
నగరంలోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమాజీగూడలోని ఆల్పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 5వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్, డిసెంబర్ 28: నగరంలోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమాజీగూడలోని ఆల్పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 5వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో పాటు.. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.