Share News

Principal Suicide: హెచ్‌ఎం మృతిపై హైకోర్టు సుమోటో విచారణ

ABN , Publish Date - May 04 , 2025 | 04:12 AM

హైకోర్టు పదవీ విరమణ ప్రయోజనాలు అందని కారణంగా వృద్ధి చెందిన మనోవేదనతో మృతి చెందిన ప్రధానోపాధ్యాయుడు కూరపాటి పాండురంగయ్య మృతిపై సుమోటో విచారణ చేపట్టింది. ఆర్థికశాఖ, పాఠశాల విద్యాశాఖ, అకౌంటెంట్ జనరల్‌కు నోటీసులు జారీ చేసి జూన్‌లో తదుపరి విచారణను వాయిదా వేసింది

Principal Suicide: హెచ్‌ఎం మృతిపై హైకోర్టు సుమోటో విచారణ

  • పదవీ విరమణ ప్రయోజనాలుఇవ్వకపోవడంపై ప్రభుత్వానికి నోటీసులు

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తూ మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఉదంతంపై హైకోర్టు స్పందించింది. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలంటూ ఆర్థికశాఖ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, అకౌంటెంట్‌ జనరల్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. ఖమ్మం జిల్లా ఎంకూరు మండల జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన కూరపాటి పాండురంగయ్య 2024 జూలై నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు.


మనోవేదనతో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతిచెందారు. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ రేణుకల ధర్మాసనం... పిటిషన్‌గా స్వీకరించింది. తదుపరి విచారణను జూన్‌ నెలకు వాయిదా వేసింది.

Updated Date - May 04 , 2025 | 04:12 AM