Konatham Dilip: కొణతం దిలీప్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ తాత్కాలిక సస్పెన్షన్
ABN , Publish Date - May 25 , 2025 | 04:47 AM
దాదాపు పది క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొణతం దిలీప్‌కు వ్యతిరేకంగా పోలీసులు జారీచేసిన లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ)ను హైకోర్టు తాత్కాలికంగా జూన్ 11 వరకు సస్పెండ్ చేసింది.
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): దాదాపు పది క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొణతం దిలీప్‌కు వ్యతిరేకంగా పోలీసులు జారీచేసిన లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ)ను హైకోర్టు తాత్కాలికంగా జూన్ 11 వరకు సస్పెండ్ చేసింది. ఆ రోజు నాటికి అమెరికా నుంచి హైదరాబాద్‌కు కచ్చితంగా తిరిగి రావాలని స్పష్టం చేసింది. తండ్రి 15వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా పుస్తకావిష్కరణ కోసం అమెరికాలోని వర్జీనియా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు జారీచేసిన ఎల్‌వోసీని కొట్టేయాలని దిలీప్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ జే శ్రీనివాసరావుల డివిజన్ బెంచ్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు..
ఓ కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని హైకోర్టు సుమోటోగా ఇంప్లీడ్ చేసింది. ఆయన నల్లగొండ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ముగ్గురు పార్ట్‌టైం ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని 2020లో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అవి అమలు కాని నేపథ్యలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. దాంతో కలెక్టర్ నారాయణరెడ్డిని సుమోటోగా ఇంప్లీడ్ చేసిన హైకోర్టు.. నాలుగువారాల్లో తమ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీచేసింది.
అంతర్జాతీయ స్థాయికి ‘మై నేషన్’ బ్రాండ్
తెలంగాణలోని ఆయా జైళ్లల్లో ‘మై నేషన్’ బ్రాండ్ పేరుతో ఖైదీలు తయారు చే స్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ప్రపంచ అందా ల పోటీల సందర్భంగా శిల్పారామంలో జైలు ఉత్పత్తుల విక్రయ శాలను ఏర్పాటు చేశారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన సుందరీమణులు ఆ స్టాల్‌ను సందర్శించి ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల్ని పరిశీలించారు.మహిళా ఖైదీలు అల్లికలు, కట్లతో ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలపట్లవారు ఆకర్శితులయ్యారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..