Share News

High Court Questions: మెడికల్‌ అడ్మిషన్లలో క్రీడా కోటా అమలు చేస్తారా

ABN , Publish Date - Aug 26 , 2025 | 02:51 AM

వైద్య విద్య ప్రవేశాల్లో గతంలో అమలు చేసి, ఉపసంహరించుకున్న అరశాతం 5%స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కోటాను అమలు చేసే ఉద్దేశం..

High Court Questions: మెడికల్‌ అడ్మిషన్లలో క్రీడా కోటా అమలు చేస్తారా

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

వైద్య విద్య ప్రవేశాల్లో గతంలో అమలు చేసి, ఉపసంహరించుకున్న అరశాతం (0.5ు) స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ కోటాను అమలు చేసే ఉద్దేశం ఉందా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మెడికల్‌ అడ్మిషన్లలో గతంలో అమలు చేసిన స్పోర్ట్స్‌ కోటాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్పోర్ట్స్‌ కోటా అమలు చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం అని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలని పేర్కొంటూ ధర్మాసనం విచారణను సెప్టెంబర్‌ 4వతేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 02:51 AM