Municipal Elections: మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:08 AM
మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
11లోగా సమాధానం ఇవ్వండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై వచ్చేనెల 11 నాటికి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్మల్ మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్‌పీ రాజేందర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆలస్యానికి కారణం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వం వివరణ తెలుసుకుని చెప్పడానికి సమయం కావాలని కోరడంతో విచారణను జూలై 11కు వాయిదా వేసింది.