మెట్రో కారిడార్-6 పనులపై హైకోర్టు స్టే..
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:52 AM
వారసత్వ కట్టడాలపై ప్రభావం ఎంత ఉంటుందో సమీక్షించే హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జరపకుండా మెట్రో రెండో దశ కారిడార్- 6 పనులు చేపట్టకూడదంటూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీచేసింది.
వారసత్వ కట్టడాలపై సమీక్ష చేయకుండా చేపట్టకూడదని ఆదేశం
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): వారసత్వ కట్టడాలపై ప్రభావం ఎంత ఉంటుందో సమీక్షించే హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ జరపకుండా మెట్రో రెండో దశ కారిడార్- 6 పనులు చేపట్టకూడదంటూ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీచేసింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న ఈ మార్గంలో చార్మినార్, ఫలక్‌నుమా వంటి వారసత్వ కట్టడాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా పనులు జరపకూడదని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు మూడు వారాల సమయం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరడంతో అప్పటివరకు స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్(ఏపీడబ్ల్యూఎఫ్) సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ రహీమ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్, ఇతర హెరిటేజ్ చట్టాల ప్ర కారం స్వతంత్ర నిపుణుల కమిటీతో వారసత్వ కట్టడాలపై పడే ప్రభావాన్ని మదింపు వేయాల్సి ఉం టుందని, కానీ దాన్ని అమలు చేయలేదని తెలిపారు. దీనిపై గురువారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ ఏడా ది జనవరి 31న పిటిషన్ దాఖలు కాగా తొమ్మిది వాయిదాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని గుర్తించింది. మరోసారి మూడు వారాల సమయం ఇచ్చి విచారణను వాయిదా వేసింది.
సంస్కృతం, వేదశాస్త్రాల పరిశోధనలకు
సీఎ్‌సయూతో ఐఐటీహెచ్ ఒప్పందం
కంది, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): సంస్కృతం, భాషాశాస్త్రం, కంప్యూటేషనల్ సంస్కృతం, వేద శాస్త్రాలు, తత్వశాస్త్రం తదితర అనుబంధ విభాగాల్లో విద్యా సహకారం కోసం సెంట్రల్ సంస్కృత విశ్వవిద్యాలయం(సీఎ్‌సయూ)తో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, సీఎ్‌సయూ వైస్‌చాన్స్‌లర్ శ్రీనివాస పరాఖేడిలు గురువారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో ఐఐటీహెచ్‌లోని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, సీఎ్‌సయూ కలిసి సంప్రదాయ పురాతన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతోపాటు సాంకేతిక పరిశోధన, విద్యలో కొత్త కోణాలను ఆవిష్కరించే అవకాశం ఉందన్నారు. సంస్కృత భాషలో లోతైన జ్ఞానాన్ని పొందినట్లయితే సంప్రదాయ పురాతన జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చని ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..
లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా
For National News And Telugu News