Moosi River Flood Warning: నగరంలో వర్ష బీభత్సం.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:42 AM
Moosi River Flood Warning: వర్ష బీభత్సం కారణంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న(గురువారం) పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం మొదలైన వర్షం అర్థరాత్రి వరకూ పడింది. కుండపోత వర్షం కావటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చింది. రోడ్లపై సైతం భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక, భారీ వర్షాలతో హిమాయత్ సాగర్‌కు పెద్దఎత్తున వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే అధికారులు హిమాయత్ సాగర్ గేట్లు తెరవనున్నారు. నీటిని దిగువన ఉన్న మూసీలోకి విడుదల చేయనున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. సహాయం కోసం 040-21111111కు ఫోన్ చేయాలని సూచించారు.

సెల్లార్లలోకి నీళ్లు..
వర్ష బీభత్సం కారణంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. సెల్లార్లలోని వాహనాలు నీట మునిగిపోయాయి. సమాచారం అందుకున్న మణికొండ మున్సిపల్ కమిషనర్ స్పాట్‌కు చేరుకున్నారు. సెల్లార్లలోని నీటిని క్లియర్ చేయించారు. రోడ్లకు గండి కొట్టి, మోటార్లతో సెల్లార్లలోని వర్షపు నీటిని క్లియర్ చేశారు. ఇక, వర్షాల కారణంగా కైరా స్కూలు సమీపంలోని ఓ ఇళ్లు కూలిపోయింది.

జంటనగరాల్లో భారీగా వర్షపాతం
ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు.
ఎస్సార్ నగర్‌లో 11 సెంటీ మీటర్లు.
ఖైరతాబాద్‌లో 11 సెంటీ మీటర్లు.
సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.
అత్యధికంగా
గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం.
శ్రీనగర్ కాలనీలో 11.1 సెంటీ మీటర్లు.
యూసుఫ్ గూడలో 10.4 సెంటీ మీటర్లు.
ఉప్పల్‌లో 10 సెంటీ మీటర్లు.
బంజారాహిల్స్‌లో 9 సెంటీ మీటర్లు.
నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్లు.
ఎల్బీనగర్‌లో 9.3 సెంటీ మీటర్లు.
గోల్కొండ 7.9 సెంటీ మీటర్లు.
బోరబండ 7.5 సెంటీ మీటర్లు.
ఇవి కూడా చదవండి
సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం: బొప్పరాజు
మరో విద్యుత్ ఉద్యమం చేపడతాం: అక్కినేని వనజ