సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం: బొప్పరాజు
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:25 AM
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఏలూరు రూరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఏలూరులో గురువారం జరిగిన రెవెన్యూ ఉద్యోగుల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశామని, ఈలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదన్నారు. కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయలేదని, మూడేళ్లుగా కమిటీలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందు లు పడ్డారని, టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తే సమస్యలు తీరుతాయని ఆశిస్తే...నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఒక్కసారైనా సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. విజయవాడలో అన్ని జిల్లాల సంఘాల నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.