Heavy Rain Alert: నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:54 AM
రాష్ట్రంలో మంగళ, బుధ వారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ...
రాష్ట్రంలో మంగళ, బుధ వారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News