Harish Rao: కాళేశ్వరం కమిషన్ నివేదిక మాకూ ఇవ్వండి
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:53 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను తమకు కూడా ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసిన హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను తమకు కూడా ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావును కలిసి విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తరఫున, హరీశ్ రావు తరఫున రెండు వినతి పత్రాలను సీఎ్‌సకు అందజేశారు. సీఎ్‌సను కలిసిన వారిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News