Harish Rao fires on Revanth Reddy: ప్రతిపక్షాల గొంతునొక్కడం ప్రజా పాలనా: హరీశ్‌రావు
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:37 PM
ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని, రెండ్రోజులే అసెంబ్లీని నడిపిస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. సభను కనీసం 15 రోజులు పాటు జరపాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతోందని, రెండ్రోజులే అసెంబ్లీని నడిపిస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. సభను కనీసం 15 రోజులు పాటు జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను వదిలి బురద రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని హరీశ్ మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదని, అలాగే రేపటి అజెండా ఏంటో కూడా చెప్పలేదని అన్నారు. కాళేశ్వరంపై చర్చకు మేం సిద్ధమేనని సవాల్ విసిరారు. రైతులకు యూరియా సరఫరా, ప్రజాసమస్యలపై ముందుగా చర్చించాలని పట్టుబట్టారు. యూరియా సరఫరాను బీజేపీ అడ్డుకుంటోందనే అంశంపై ముందుగా చర్చించాలని అన్నారు.
ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..