Harish Rao: ఆశాలకు 18 వేల వేతనం ఇవ్వాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:17 AM
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు..
స్థానిక ఎన్నికల్లోపు వారి సమస్యలు పరిష్కరించాలి
లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వారే బుద్ధి చెబుతారు: హరీశ్
కవాడిగూడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల లోపు ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే వారే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే ప్రభుత్వం దగ్గర పైసలు లేవని సీఎం రేవంత్ దాటవేస్తున్నారని విమర్శించారు. డబ్బుల్లేనప్పుడు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇగిరేషన్ శాఖల్లో 26వేల కోట్ల పనుల కోసం టెండర్లను ఎలా పిలిచారని ఆయన ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్‌రెడ్డి బంధువుల భూముల అభివృద్ధి కోసం టెండర్లను పిలుస్తున్నారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన బిల్డింగ్‌ను.. గజానికో పోలీసును పెట్టి ఇనుప కంచెలు నిర్బంధాల మధ్య రేవంత్‌రెడ్డి ప్రారంభించడానికి వెళ్లి యూనివర్సిటీని ఉద్ధరిస్తానని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన పనులకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ జేబులో కత్తెర పెట్టుకొని రేవంత్ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరంలోపే రెండులక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన సీఎం రేవంత్ ఇప్పుడే ఏ ముఖం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళుతున్నారని అన్నారు. దమ్ముంటే గన్‌మెన్, పోలీసులు లేకుండా సీఎం ఒక్కడే ఓయూకి రావాలని ఆయన సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News