Share News

Harish Rao: రేవంత్‌ చేసేది తెలంగాణ రైజింగ్‌ కాదు ఫాలింగ్‌

ABN , Publish Date - Mar 07 , 2025 | 04:33 AM

జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధిరేటు, రిజిరేస్టషన్లు, వెహికిల్‌ టాక్స్‌లో నెగెటివ్‌ వృద్ధిరేటు రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎండగడుతున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: రేవంత్‌ చేసేది తెలంగాణ రైజింగ్‌ కాదు ఫాలింగ్‌

  • రాష్ట్ర ఆదాయం తగ్గడంపై క్షమాపణ చెప్పాలి:హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి6(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధిరేటు, రిజిరేస్టషన్లు, వెహికిల్‌ టాక్స్‌లో నెగెటివ్‌ వృద్ధిరేటు రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యాన్ని ఎండగడుతున్నాయని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌ చేస్తున్నది తెలంగాణ రైజింగ్‌ కాదని ఫాలింగ్‌ అని ఎద్దేవా చేశారు. హైడ్రా, మూసీ వంటి తలాతోకాలేని నిర్ణయాలు, అనాలోచిత చర్యలవల్ల ఆగష్టు 2024 తర్వాత రిజిరేస్టషన్‌ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందని ఎక్స్‌వేదికగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గడంపై ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలనపై దృష్టి పెట్టాలన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 04:33 AM