Harish Rao: రేవంత్‌ది జాబ్‌లెస్ క్యాలెండర్
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:24 AM
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. 20 నెలల్లో 12 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
12 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదు: హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. 20 నెలల్లో 12 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊరించారని.. అది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్‌లెస్ క్యాలెండర్, దగా క్యాలెండర్ అని మండిపడ్డారు.
నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ నిరుద్యోగులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులు శనివారం హరీశ్‌ను కలిశారు. తాము చేపట్టనున్న చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.