Harish Rao: బీర్లను, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తారా?
ABN , Publish Date - May 19 , 2025 | 04:21 AM
ఇష్టం వచ్చినట్లు మద్యంఽ ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా రాష్ట్ర ఖజానా నింపాలని చూస్తారా? బీర్లను, బార్లను నమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తారా అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డీ.. మీరు చెప్పిన మార్పు ఇదేనా?: హరీష్‌రావు
హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): ఇష్టం వచ్చినట్లు మద్యంఽ ధరలు పెంచి, తాగుబోతుల ద్వారా రాష్ట్ర ఖజానా నింపాలని చూస్తారా? బీర్లను, బార్లను నమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తారా అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీష్‌రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బెల్ట్‌షాపులు మూస్తామని చెప్పి, గల్లీకో బెల్ట్‌షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ తెస్తామన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
ఓ వైపు మద్యం ధరలు పెంచి, మరోవైపు విక్రయాలను రెండింతలు చేయాలని అధికారులను ఆదేశించడంలోనే ప్రభుత్వం అంతర్యం స్పష్టమవుతోందన్నారు. ఉన్న మద్యం దుకాణాలు చాలక.. సర్కారు గల్లాపెట్టె నింపేందుకు గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30కిలోమీటర్లకు ఒకటి చొప్పున 100కుపైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని హరీ్‌షరావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News