Share News

Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థత

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:10 AM

బీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత, మాజీమంత్రి హరీశ్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధ పడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బేగంపేటలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు.

Harish Rao: మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థత

  • కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిక.. కేటీఆర్‌ పరామర్శ

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత, మాజీమంత్రి హరీశ్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధ పడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఏడు గంటలకు బేగంపేటలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. జనరల్‌ ఫిజిషియన్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌ వైద్యుడు డాక్టర్‌ ఎస్‌.పాటిల్‌ సుదేశ్‌ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలని హరీశ్‌ రావుకు సూచించారు.


వైరల్‌ ఫీవర్‌తో బాధ పడుతున్న హరీశ్‌ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ సంగతి తెలియడంతో హరీశ్‌ రావును పరామర్శించడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ నేతలు హుటాహుటిన కిమ్స్‌ ఆస్పత్రికి వచ్చారు.

Updated Date - Jun 17 , 2025 | 04:10 AM