Child Welfare: ప్రతి చిన్నారికీ రక్షణ!
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:07 AM
రాష్ట్రంలో బాలల సంరక్షణ, పునరావాస కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సంక్షేమ కమిటీల ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా
మరో 16 జువైనల్ జస్టిస్ బోర్డులు కూడా..
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బాలల సంరక్షణ, పునరావాస కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ), జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)ల నియామకాలకు ప్రకటన జారీ చేసింది. ఈ నియామకాలను పిల్లల సంరక్షణ, మోడల్ రూల్స్ 2016లోని నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఒక్కో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఒక చైర్ పర్సన్‌తో పాటు నలుగురు సభ్యులుంటారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 సీడబ్ల్యూసీలు ఉండగా.. 17 జేజేబీలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఈ సారి కొత్తగా మరో 16 జేజేబీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ కమిటీలు, బోర్డులు బాలల సంరక్షణ, రక్షణ, పునరావాసం, నేరాలకు పాల్పడిన బాలలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని బాలల సంరక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆగస్టు 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News