Share News

Ponnam Prabhakar: ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట

ABN , Publish Date - May 04 , 2025 | 03:20 AM

బంజారాహిల్స్‌లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారాలు సకాలంలో గుర్తించి స్వాధీనం చేసుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశంసించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజావసరాల కోసం భూముల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు

Ponnam Prabhakar: ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట

  • ప్రజావసరాల కోసం అభివృద్ధికి ప్రణాళిక

  • బంజారాహిల్స్‌లో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలంలో గుర్తించారు: మంత్రి పొన్నం ప్రభాకర్‌

బంజారాహిల్స్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట వేసి.. ఆ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపట్టారని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో షేక్‌పేట రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న 12 ఎకరాల భూమిని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బంజారాహిల్స్‌ సర్వే నంబర్‌ 102/1లో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. స్థల స్వాధీనంలో కొన్నిచోట్ల అవాంతరాలు వచ్చినప్పటికీ అధికారులు చాకచక్యంగా అధిగమించారని తెలిపారు. వివాదంలో ఉన్నది ప్రభుత్వ స్థలమని గుర్తించడంతోపాటు సకాలంలో స్పందించి ప్రహరీ ఏర్పాటు చేశారంటూ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో షేక్‌పేట తహసీల్దార్‌ అనితారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 03:21 AM