Damodara: రక్తం బ్యాగుల చోరీపై సర్కార్ సీరియస్
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:54 AM
నిలోఫర్ ఆస్పత్రిలో రక్తం బ్యాగుల దొంగతనం వ్యవహారంపై సర్కార్ సీరియస్ అయింది. అక్కడి సిబ్బంది రక్తం బ్యాగులను దొంగలించి బయటకు అమ్ముకుంటున్నారని ‘బ్లడ్ బ్యాంకుల్లో దొంగల’ పేరిట ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురితమైంది.

విచారణకు ఆదేశించిన వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): నిలోఫర్ ఆస్పత్రిలో రక్తం బ్యాగుల దొంగతనం వ్యవహారంపై సర్కార్ సీరియస్ అయింది. అక్కడి సిబ్బంది రక్తం బ్యాగులను దొంగలించి బయటకు అమ్ముకుంటున్నారని ‘బ్లడ్ బ్యాంకుల్లో దొంగల’ పేరిట ఈనెల 22న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా స్పందించి, విచారణకు ఆదేశించారు. అలాగే ఆస్పత్రి పనితీరు, అక్కడి ఉన్నతాధికారులపైనా వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బోధనాస్పత్రుల సీనియర్ ప్రొఫెసర్లతో విచారణ కమిటీ వేయాలని మంత్రి ఆదేశించనట్లు సమాచారం.
ఆస్పత్రిలో అందుతున్న వైద్యం నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరు వరకు పలు అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరపనుంది. సూపరింటెండెంట్‌పై వస్తున్న ఆరోపణలపైనా ఆరా తీయనుంది.నిలోఫర్‌లో బ్లడ్ బ్యాంక్‌ల్లో చోరీ అంశంపై కమిటీ ప్రత్యేకంగా విచారణ జరుపనుంది. డీఎంఈ నరేంద్ర కుమార్ పర్యవేక్షణలో ఇతర బోధనాస్పత్రుల ప్రొఫెసర్లతో ఆ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.