Public Holidays Calendar: సెలవుల లిస్ట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. 2026లో ఏకంగా ఇన్ని సెలవులా?..
ABN , Publish Date - Dec 09 , 2025 | 08:41 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది. వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: 2026 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది. వచ్చే సంవత్సరంలో 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశాల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఉత్తర్వులలో పేర్కొన్న 27 సాధారణ సెలవు దినాలలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయబడతాయి. వీటితో పాటు ఆదివారాలు, రెండవ శనివారాలు యథావిధిగా సెలవు దినాలుగా కొనసాగుతాయి.
2026లో సాధారణ సెలవు దినాలు..
సంక్రాంతి (జనవరి 15)
గణతంత్ర దినోత్సవం (జనవరి 26)
హోలీ (మార్చి 3)
ఉగాది (మార్చి 19)
ఈదుల్ ఫితర్ / రంజాన్ (మార్చి 21)
శ్రీ రామ నవమి (మార్చి 27)
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)
ఈదుల్ అజహా / బక్రీద్ (మే 27)
బోనాలు (ఆగస్టు 10)
స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)
వినాయక చవితి (సెప్టెంబర్ 14)
విజయ దశమి / దసరా (అక్టోబర్ 20)
దీపావళి (నవంబర్ 8)
క్రిస్మస్ (డిసెంబర్ 25)
ఐచ్ఛిక సెలవులు..
న్యూ ఇయర్ డే (జనవరి 1)
కనుమ (జనవరి 16)
శ్రీ పంచమి (జనవరి 23)
మహావీర్ జయంతి (మార్చి 31)
బుద్ధ పౌర్ణమి (మే 1)
నరక చతుర్దశి (నవంబర్ 8)
క్రిస్మస్ ఈవ్ (డిసెంబర్ 24)
ఇవి కూడా చదవండి
ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
పదవి కావాలంటే పైసలు పంచాల్సిందే..