Bhatti Vikramarka news: ఓఆర్‌ఆర్ వెలుపలకు కాలుష్య కారక పరిశ్రమలు
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:44 AM
ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించే
హౌసింగ్ బోర్డు ఇళ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలి: భట్టి
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ ఓఆర్‌ఆర్ వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శనివారం సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధివిధానాలు, తరలింపు క్యాలండర్‌ను రూపొందించాలని సూచించారు. తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని రాజీవ్ స్వగృహ ఇళ్లు, హౌసింగ్ బోర్డు ఆధీనంలోని ఖాళీ స్థలాల విక్రయాలను మంత్రులు సమీక్షించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అధికారులకు మంత్రులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే.. దేశ దిశను మార్చనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కుల గణనపై ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ కుల గణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ చేసిన అధ్యయనం చరిత్రాత్మకమైనదని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News