Share News

Airport in Warangal: వరంగల్ వాసులకు శుభవార్త.. కొత్త ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:57 PM

వరంగల్ మామనూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో నూతన విమానాశ్రయం ఉండకూడదని కేంద్ర ప్రభుత్వంతో గతంలో జీఎంఆర్ సంస్థ ఒప్పందం చేసుకుంది.

Airport in Warangal: వరంగల్ వాసులకు శుభవార్త.. కొత్త ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Central government gives green signal to Warangal Airport

వరంగల్ (Warangal) వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వరంగల్ రూపు రేఖలు మార్చేయనున్న మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మామూనూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. వరంగల్ మామనూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో నూతన విమానాశ్రయం ఉండకూడదని కేంద్ర ప్రభుత్వంతో గతంలో జీఎంఆర్ సంస్థ ఒప్పందం చేసుకుంది (Warangal Airport).


ఆ ఒప్పందం ప్రకారం వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్రం ఊగిసలాడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఒప్పందంలోని క్లాజ్‌ను జీఎంఆర్ సంస్థ సవరించింది. వరంగల్ మామూనురు విమానాశ్రయానికి ``నో అబ్జెక్షన్ సర్టిఫికెట్`` ఇచ్చింది. దీంతో విమానాశ్రయ నిర్మాణానికి క్లియరెన్స్ లభించింది. ఇటీవలె ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ పూర్తిచేసి కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీంతో అనుమతి లభించింది. భారీ విమానాలు దిగేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు కాబోతున్నాయి.


ఈ విమానాశ్రయం కోసం దాదాపు 1000 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇప్పటికే 650 ఎకరాలకు పైగా భూ సేకరణను ప్రభుత్వం పూర్తి చేసింది. మరో 250 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ భూసేకరణ కోసం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. కాగా, విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇస్తే చాలు.. నిర్మాణ పనులను కేంద్రమే పర్యవేక్షించనుంది.

ఇవి కూడా చదవండి..

అత్యంత వేగంగా రాష్ట్రం అభివృద్ది: సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

రైతులకు ప్రభుత్వం శుభవార్త...

ఏపీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్..

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 28 , 2025 | 05:57 PM