Share News

DA Hike: డీఏ వచ్చేసింది

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:00 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలలో (డీఏ) ఒక డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు డీఏలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

DA Hike: డీఏ వచ్చేసింది

  • ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు

  • 3.64 శాతం డీఏను విడుదల

  • చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూలైలో అందుకునే వేతనంతోపాటు చెల్లింపు

హైదరాబాద్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలలో (డీఏ) ఒక డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు డీఏలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2023 జనవరి1కి సంబంధించిన 3.64 శాతం డీఏను శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా జారీ చేశారు. తాజా డీఏతో ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం 26.39 శాతం నుంచి 30.03 శాతానికి పెరగనుంది.


ఈ పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఈ డీఏకు సంబంధించిన నగదును జూన్‌ నె ల వేతనంలో కలిపి జూలైలో చెల్లిస్తారు. డీఏ బకాయిలను ఉద్యోగులు, పెన్షనర్ల జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులకు మాత్రం 2023 జనవరి 1 నుంచి రావాల్సిన బకాయిల్లో 10 శాతం సొమ్మును వారి ప్రాన్‌(శాశ్వత పదవీ విమరణ) ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 28 నెలల పాటు సమాన వాయిదాలలో చెల్లిస్తారు. 2025 అక్టోబరు 31లోపు పదవీ విరమణ తీసుకునే ఉద్యోగుల డీఏ బకాయిలను కూడా 28 నెలవారీ సమాన వాయిదాలలో చెల్లిస్తారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 03:00 AM