2004-14 వరకు ‘ఇందిరమ్మ ఇళ్ల’లో అవినీతి
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:01 AM
2004 నుంచి 2014 వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.వేలాది కోట్ల అవినీతి జరిగిందని, దానిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) డిమాండ్ చేసింది.

విచారణ జరిపించాలని సీఎంకు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): 2004 నుంచి 2014 వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.వేలాది కోట్ల అవినీతి జరిగిందని, దానిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) డిమాండ్ చేసింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌కు లేఖ రాశారు. ఆ పదేళ్ల కాలంలో ప్రభుత్వం 33.4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, అందులో 20.49 లక్షల ఇళ్లు పూర్తయినట్లు చూపారని తెలిపింది.
అయితే ఆ ఇళ్లలో కొన్నింటి నిర్మాణాలు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు చూపారని, కొన్నింటి పనులు అసలు ప్రారంభమే కాలేదని, కొన్ని సగంలో నిలిచిపోయాయని వివరించింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించిందని, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం అవినీతి అధికారులను ప్రోత్సహించినట్లవుతుందని తెలిపింది.