Share News

Ganesh idol: రేవంత్‌ గెట్‌పలో వినాయకుడి విగ్రహం

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:33 AM

గోషామహల్‌ నియోజకవర్గం ఆగాపురాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గెట్‌పలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

Ganesh idol: రేవంత్‌ గెట్‌పలో వినాయకుడి విగ్రహం

  • ఆగాపురాలో ఏర్పాటు.. రాజాసింగ్‌ ఫిర్యాదు

  • పలు ఠాణాల్లో బీజేపీ నేతల ఫిర్యాదులు

  • మనోభావాలు దెబ్బతీయొద్దు.. నిర్వాహకులతో డీసీపీ

  • ఆ విగ్రహం తొలగించి మరొకటి ప్రతిష్ఠ

గోషామహల్‌/బాలానగర్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): గోషామహల్‌ నియోజకవర్గం ఆగాపురాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గెట్‌పలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ నేతృత్వంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. సౌత్‌ వెస్ట్‌ డీసీపీ జీ చంద్రమోహన్‌ ఆ మండపాన్ని సందర్శించి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని సాయికుమార్‌కు సూచించారు. పోలీసుల ఆదేశాలతో ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ప్రతిష్ఠించారు. ఈ ఘటనపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందుగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్లలో సాయికుమార్‌పై బీజేపీ నాయకులు ఫిర్యాదులు అందజేశారు.

Updated Date - Aug 29 , 2025 | 04:33 AM