Free Rice Distribution: ఉచిత సన్న బియ్యం పంపిణీ పునఃప్రారంభం
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:45 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత సన్న బియ్యం పంపిణీ మళ్లీ మొదలైంది. గత మూడు నెలల కోటాను జూన్ నెలలో పంపిణీ చేసిన తరువాత జూలై, ఆగస్టు నెలల్లో ...
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉచిత సన్న బియ్యం పంపిణీ మళ్లీ మొదలైంది. గత మూడు నెలల కోటాను జూన్ నెలలో పంపిణీ చేసిన తరువాత జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ షాపులు మూసివేశారు. ఇప్పుడు సెప్టెంబరు నెల కోటా పంపిణీని సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 99,70,832 రేషన్ కార్డుల ద్వారా 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2,02,713 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ బియ్యాన్ని ఇప్పటికే 17 వేలకు పైగా ఉన్న రేషన్ షాపులకు పంపించారు. ఈనెల 15 వరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం అందజేస్తారు. జూలై, ఆగస్టు నెలల్లో కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబరు నుంచి కోటా కేటాయింపులు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News