Former MLA Katasani : మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆక్రమణలపై హైడ్రా కొరడా
ABN , Publish Date - Jan 29 , 2025 | 04:00 AM
హైడ్రా బుల్డోజర్లు మరోసారి అమీన్‌పూర్‌లో ఆక్రమణలపై విరుచుకుపడ్డాయి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. ఇటీవల స్తబ్ధుగా ఉన్న హైడ్రా మంగళవారం మళ్లీ జూలు విదిల్చింది. జీవవైవిధ్య చెరువుగా ప్రభుత్వం గుర్తించిన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్దచెరువులో ఆక్రమణలపై కొరడా ఝళిపించింది.
అమీన్‌పూర్ పెద్దచెరువు భూమిలో నిర్మాణాల కూల్చివేత
గతంలో కూల్చివేసిన చోటే మళ్లీ కబ్జాదారుల నిర్మాణాలు
స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేసిన హైడ్రా అధికారులు
పద్మావతినగర్ రోడ్డు ఆక్రమణల తొలగింపు
పటాన్‌చెరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): హైడ్రా బుల్డోజర్లు మరోసారి అమీన్‌పూర్‌లో ఆక్రమణలపై విరుచుకుపడ్డాయి. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. ఇటీవల స్తబ్ధుగా ఉన్న హైడ్రా మంగళవారం మళ్లీ జూలు విదిల్చింది. జీవవైవిధ్య చెరువుగా ప్రభుత్వం గుర్తించిన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్దచెరువులో ఆక్రమణలపై కొరడా ఝళిపించింది. పెద్దచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూముల్లో పెద్దఎత్తున మట్టిపోసి చుట్టూ ప్రహరీని నిర్మించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పెద్దచెరువు పక్కనే ఉన్న సర్వే నంబర్ 193, 194, 323లోని పద్మావతినగర్ కాలనీకి వెళ్లే రోడ్డును మూసివేసి ప్లాట్లలోకి వెళ్లకుండా కాటసాని వర్గీయులు దౌర్జన్యం చేస్తూ వస్తున్నారు. 24 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పద్మావతినగర్‌కు రోడ్డు లేకుండా చేయడంతో బాధితులు న్యాయ పోరాటం ప్రారంభించారు. గతంలో చెరువు కబ్జాతో పాటు పద్మావతినగర్ కాలనీ కబ్జాలపై హైడ్రా స్పందించింది. సుమారు 20 ఎకరాల చెరువు ఎఫ్‌టీఎల్ భూములుగా గుర్తించి, సర్వే చేసి హద్దులను నిర్ణయించారు. చెరువు పరిధి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీని గతంలోనే కూల్చివేశారు. పద్మావతినగర్ కాలనీకి వెళ్లే రోడ్డును పునరుద్ధరించారు. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ భూములను స్వాధీనం చేసుకున్నామని హైడ్రా ప్రకటన కూడా చేసింది. కొద్ది రోజులు మిన్నకుండిపోయిన ఆక్రమణదారులు.. గతంలో హైడ్రా కూల్చిన ప్రహరీని, వాచ్‌మన్ గదులను తిరిగి నిర్మించారు. పద్మావతినగర్‌కు వెళ్లే రోడ్డును ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రహరీ కూడా నిర్మిస్తున్నారు. దీంతో బాధితులు మళ్లీ హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు. ఆయన ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
కాటసాని వర్గీయులు బెదిరిస్తున్నారు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి మనుషులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పద్మావతినగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డును ఆక్రమించిన కాటసాని వర్గీయులతో 20ఏళ్లుగా పోరాడుతున్నామన్నా రు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిష్ట రమేష్, శిష్ట లోహిత్, మౌనిరెడ్డి, పుల్లారెడ్డి తదితరులు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కుత్బుల్లాపూర్‌లో 8 గదుల కూల్చివేత
గాజులరామారం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): చెరువులో అక్రమ నిర్మాణాలను గతంలో హైడ్రా కూల్చివేసిన చోటే మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టడం తో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు స్పందించారు. గాజులరామారం డివిజన్‌లోని దేవేందర్‌నగర్‌లో సర్వే నం.329లో కబ్జాదారులు ఇటీవల 8 గదు లు నిర్మించారు. హైడ్రా అధికారులు వాటిని నేల మ ట్టం చేసి వెళ్లారు. అయితే కబ్జాదారులు మళ్లీ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు మంగళవారం వాటిని కూల్చివేశారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..
Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు
Also Read: జగన్ నాడు నేడు.. అసలు రహస్యం చెప్పిన కేంద్రం
Also Read: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
For Telangana News And Telugu News