Former Minister: మాజీమంత్రి హెచ్చరిక.. నీరా కేఫ్‌ను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోం..
ABN , Publish Date - Feb 26 , 2025 | 08:02 AM
గౌడ కులస్థుల ఆత్మగౌరవానికి నీరా కేఫ్(Neera Cafe) ప్రతీక అని, దానిని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) హెచ్చరించారు.
- వచ్చేనెల 17న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
- మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: గౌడ కులస్థుల ఆత్మగౌరవానికి నీరా కేఫ్(Neera Cafe) ప్రతీక అని, దానిని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) హెచ్చరించారు. నీరా కేఫ్‌ను ధ్వంసం చేయడమంటే గౌడ కులస్థులపైన, తమ వృత్తి పైన దాడిగానే పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మార్చి 17న వేలాదిమందితో చలో హైదరాబాద్ నిర్వహించి ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జూపార్క్ సందర్శన మరింత ప్రియం.. పెరిగిన ధరలు
రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా తరలివచ్చి దీనిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కార్పొరేటర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. కల్లుగీత పారిశ్రామిక సంఘం, బీసీ నిధులతో ఏర్పాటు అయిన నీరా కేఫ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
నీరా కేఫ్ అంటే భవనం కాదు గౌడ సామాజిక వర్గం ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాని మీద సర్వ హక్కులు కల్లుగీత కార్మికులవేనని అన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి నీరా కేఫ్ వద్ద ఈత చెట్టును కొట్టేయించిందని, గీత కార్మికులు చెట్టు ఎక్కే ప్రతిమలను తొలగించి ట్యాంక్‌బండ్‌లో పడేశారని, అద్దాలు ధ్వంసం చేశారని, స్టిక్కర్లు తొలగించారని అన్నారు. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, ఐలు వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, సదానంద్ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బండి సాయన్న గౌడ్, మధుసూదన్ గౌడ్, తదితరులుపాల్గొన్నారు.