Nizamabad Medical College: ఐదుగురు మెడికోలపై 6 నెలల సస్పెన్షన్
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:17 AM
నిజామాబాద్ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థి రాహుల్‌రెడ్డిని ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి 6 నెలలు సస్పెండ్ చేశారు. సోమవారం జరిగిన...
నిజామాబాద్ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం
నిజామాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థి రాహుల్‌రెడ్డిని ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులను కళాశాల నుంచి 6 నెలలు సస్పెండ్ చేశారు. సోమవారం జరిగిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్ తెలిపారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం విద్యార్థి రాహుల్ రెడ్డిని శనివారం సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనను విద్యార్థి, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ కమిటీ సమీక్షించింది. ఈ కమిటీ ముందు విద్యార్థి రాహుల్ రెడ్డి తల్లిదండ్రులు హాజరై వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News