Fish Medicine: జూన్ 8, 9వ తేదీల్లో చేప మందు పంపిణీ
ABN , Publish Date - May 27 , 2025 | 03:49 AM
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. ఎగ్జిబిషన్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం, బత్తిని హరినాథ్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో జూన్ 8, 9 తేదీల్లో చేప మందును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అఫ్జల్‌గంజ్, మే 26 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి. ఎగ్జిబిషన్ సొసైటీ, రాష్ట్ర ప్రభుత్వం, బత్తిని హరినాథ్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో జూన్ 8, 9 తేదీల్లో చేప మందును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేపమందు పంపిణీ ఏర్పాట్లపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి 32 కౌంటర్లలో చేపమందు పంపిణీ ఉంటుందని, జూన్ 8న ఉదయం 8.30లకు ప్రారంభమయ్యే చేపమందు పంపిణీ మరుసటి రోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో హౌస్ సర్జన్‌కు కరోనా?
గోపాలపట్నం (విశాఖపట్నం), మే 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం నగర పరిధిలోని గోపాలపట్నం 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ హౌస్ సర్జన్‌కు కరోనా వచ్చినట్టు తెలిసింది. హోమ్ క్వారంటైన్‌లో ఆమె ఉన్నట్టు సమాచారం. ఆసుపత్రి సిబ్బంది అందరూ సోమవారం మాస్క్‌లు పెట్టుకుని కనిపించారు. రోగులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అయితే హౌస్ సర్జన్‌కు కరోనా వచ్చిన విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించలేదు. తమ దృష్టికి రాలేదన్నారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..