Warangal: మామునూరులో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:48 AM
మంత్రి కొండా సురేఖ ఇచ్చిన మాట ప్రకారం భూమికి బదులు భూమి ఇస్తేనే సర్వేకు అనుమతి ఇస్తామని, లేదంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. నక్కలపల్లి, భట్టుపల్లి, నల్లగుంట, గాడిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు నిరసన చేపట్టారు.

సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు.. భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్
వెనుదిరిగిన రెవెన్యూ అధికారులు
మామునూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి) : వరంగల్ మామునూరు విమానాశ్రయ స్థలం వద్ద రైతులు మంగళవారం ఆందోళనకు దిగారు. భూ సర్వే చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన మాట ప్రకారం భూమికి బదులు భూమి ఇస్తేనే సర్వేకు అనుమతి ఇస్తామని, లేదంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. నక్కలపల్లి, భట్టుపల్లి, నల్లగుంట, గాడిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు నిరసన చేపట్టారు. భూమి ఇవ్వని పక్షంలో మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని, అంతేగాకుండా తమ ఊరికి ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. విధి లేని పరిస్థితిలో రెవెన్యూ అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
సేకరించాల్సిన భూమి 253 ఎకరాలు
మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి ఇటీవలే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి వెయ్యి ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇప్పటికే 696ఎకరాల స్థలం ఉండగా మరో 253 ఎకరాలు అవసరమని అధికారులు నిర్ణయించారు. భూసేకరణకు నిధులను కూడా ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిం ది. ఈ నెలలోనే భూసేకరణ చేసి మరో నాలుగైదు నెలల్లో విమానాల రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గతంలో భూమి కోల్పోతున్న బాధితులకు భూమికి బదు లు భూమిని, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు ఇస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారని, దానికి కట్టుబడి ఉండాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.