Farmer Suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:23 AM
అప్పులు తెచ్చి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు...
జడ్చర్ల, నసురుల్లాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): అప్పులు తెచ్చి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తండాకు చెందిన ఇస్లావత్ రవి(40) తన ఎకరంన్నర భూమిలో గతేడాది పత్తి పంటను సాగుచేయడానికి, ఇంటి అవసరాల కోసం అప్పులు చేశాడు. వేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలోని నెమలి గ్రామానికి చెందిన రైతు బొబ్బిలి శ్రీనివాస్ (37) సోమవారం తన పొలంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. పొలానికి నీరు పెట్టేందుకు గాను విద్యుత్ బోర్ వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News