Share News

Fan Accident: పరీక్ష రాస్తుండగా ఊడిపడిన ఫ్యాన్‌

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:48 AM

పరీక్ష రాస్తుండగా తిరుగుతున్న ఫ్యాన్‌ ఊడి కింద పడడంతో ఇంటర్మీడియట్‌ విద్యార్థినికి గాయాలయ్యాయి.

Fan Accident: పరీక్ష రాస్తుండగా ఊడిపడిన ఫ్యాన్‌

  • కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థినికి గాయాలు

  • చికిత్స చేయించి పరీక్షలు రాయించిన అధికారులు

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పరీక్ష రాస్తుండగా తిరుగుతున్న ఫ్యాన్‌ ఊడి కింద పడడంతో ఇంటర్మీడియట్‌ విద్యార్థినికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం కరీంనగర్‌లో జరిగింది. విద్యార్థిని శివాన్విత ఇంటర్‌ రెండో ఏడా ది పరీక్షలను కరీంనగర్‌లోని సహస్ర జూనియర్‌ కళాశాలలో రాస్తోంది. ఆమె పరీక్ష రాస్తున్న గదిలో కొక్కెం ఊడిపోయి తిరుగుతున్న ఫ్యాన్‌ కింద పడింది. ఆ సమయంలో కింద ఉన్న శివాన్వితకు ఫ్యాన్‌ రెక్కలు తగలడంతో ఆమె ముక్కు, కన్ను కింది భాగాల్లో గాయాలయ్యాయి.


స్పందించిన సిబ్బంది వెంటనే విద్యార్థినిని పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం విద్యార్థినిని మరో గదిలో కూర్చోబెట్టి అరగంట సమయాన్ని అదనంగా కేటాయించి పరీక్ష రాయించారు.

Updated Date - Mar 13 , 2025 | 05:48 AM