Jupally Krishna Rao: మద్యం నాణ్యతలో రాజీపడొద్దు
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:52 AM
మద్యం తయారీలో నాణ్యత, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించార....
హైదరాబాద్/పూడూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మద్యం తయారీలో నాణ్యత, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలోని బృందావనం స్పిరిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిస్టిలరీ్‌సను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా డిస్టిలరీ్‌సలో ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలను మంత్రి క్షుణ్నంగా పరిశీలించారు. హోల్డింగ్ ట్యాంకులు, బ్లెండింగ్ యూనిట్, బాటిల్ ఫిల్లింగ్ ప్లాంట్‌లను పరిశీలించారు. మద్యం ఉత్పత్తి, సరఫరా, లేబులింగ్, ముడిసరుకు వినియోగంపై అధికారులతో చర్చించారు. ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని, నాణ్యతా ప్రమాణాలలో ఎలాంటి రాజీ పడకూడదని కంపెనీ యాజమాన్యానికి స్పష్టం చేశారు.
టూరిజం హబ్‌గా అనంతగిరి హిల్స్
హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న అనంతగిరి హిల్స్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన అనంతగిరి హిల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అనంతగిరి ట్రెక్కింగ్, దైవ దర్శనం, ప్రకతి ఆస్వాదనకు అనువైనదని చెప్పారు. అనంతగిరిలోని హరిత హోటల్ నిర్వహణను పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తున్నామని, దీనిని ప్రైవేట్ హోటళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News