Share News

Entrance Exam: గురుకులాల్లో ప్రవేశాలకు నేడు పరీక్ష

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:16 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Entrance Exam: గురుకులాల్లో  ప్రవేశాలకు నేడు పరీక్ష

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు గురుకులాల వారీగా మొత్తం 1,67,649 దరఖాస్తులు వచ్చాయి.6, 7, 8, 9 తరగతులకు సంబంధించిన సీట్లకు ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు కలిపి పరీక్ష నిర్వహిస్తుండగా, బీసీ గురుకులం మాత్రం మళ్లీ విడిగా దాని పరిధిలోని సీట్లకు పరీక్ష నిర్వహించనుంది. కాగా దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థి ప్రవేశ పరీక్షకు హాజరై బాగా రాయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 04:16 AM