Alwal: హైదరాబాద్‌లో వృద్ధ దంపతుల హత్య
ABN , Publish Date - May 05 , 2025 | 04:55 AM
హైదరాబాద్‌లోని అల్వాల్‌లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంట్లో ఉండాల్సిన రూ.లక్ష నగదు, వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయవవ్వడంతో ఈ హత్య తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
తలలు పగలగొట్టి, రూ.లక్ష, పుస్తెలతాడు దోపిడీ
అల్వాల్, మే 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అల్వాల్‌లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి ఇంట్లో ఉండాల్సిన రూ.లక్ష నగదు, వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెలతాడు మాయవవ్వడంతో ఈ హత్య తెలిసిన వారి పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మానిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య(70), రాజమ్మ(65) దంపతులు అల్వాల్‌లోని సూర్యానగర్ కాలనీలో మూడేళ్లుగా నివాసముంటున్నారు. కనకయ్య స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగొచ్చిన కనకయ్య.. స్థానికంగా వడ్డీలకు తిప్పేందుకు రూ.లక్ష తెచ్చాడు. ఈ విషయాన్ని తన పని ప్రదేశంలో మేస్ర్తీతోపాటు పలువురికి చెప్పాడు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రించిన కనకయ్య దంపతులు హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆ ఇంటికి వచ్చిన కుమార్తె లత తల్లిదండ్రులు విగతజీవులుగా ఉండటాన్ని గమనించింది. మంచంపై నిద్రిస్తున్న ఇద్దరి తలలపై దొడ్డు కర్రతో కొట్టినట్లు బలమైన గాయాలు ఉన్నాయి. డబ్బు కోసం తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..