Share News

Sridhar Babu: ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సహకరిస్తాం

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:38 AM

అత్యధిక మందికి ఉపాధినిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

Sridhar Babu: ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సహకరిస్తాం

  • నెలాఖరు నుంచి బకాయిలు చెల్లిస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అత్యధిక మందికి ఉపాధినిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎంఎ్‌సఎంఈ స్పార్క్‌2.0 పేరుతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎంఎ్‌సఎంఈల అభివృద్ధికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పారిశ్రామికవృద్ధిలో భాగంగా ఎంఎ్‌సఎంఈల అభివృద్ధిపై దృష్టిపెట్టామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేలా అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానం తీసుకొచ్చామని, త్వరలోనే విధివిధానాలను అమల్లోకి తెస్తామని తెలిపారు.


తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు నిపుణుల భాగస్వామ్యంతో ఎంఎ్‌సఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. నిర్వాహకుల సమస్యలను పరిష్కరిస్తామని, మార్కెటింగ్‌ కోసం ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని చెప్పారు. 2014 నుంచి పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ నెలాఖరు నుంచి విడతల వారీగా చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎవరెన్ని ప్రచారాలు చేసినా రాష్ట్రానికి పెట్టుబడులు ఆగడంలేదన్నారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 08 , 2025 | 03:38 AM