MIDHANI: మిధాని సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణమూర్తి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:37 AM
కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్(మిధాని) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా డాక్టర్ ఎస్‌వీఎస్ నారాయణమూర్తి సోమవారం బాధ్యతలు చేపట్టారు.
చంపాపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్(మిధాని) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా డాక్టర్ ఎస్‌వీఎస్ నారాయణమూర్తి సోమవారం బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో నారాయణమూర్తి బీఈ పూర్తిచేశారు. బెంగళూరులోని ఐఐఎ్‌ససీలో ఎంఈ చదివారు. ఐఐటీ-బాంబేలో పీహెచ్‌డీ పట్టా పొందారు.
తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రంలో 1993లో ఆయన చేరారు. ఆలా్ట్ర హై స్ట్రెంథ్ స్టీల్స్, టైటానియం మిశ్రమ లోహాలు, సూపర్ అల్లాయ్‌లు, అల్యూమినియం మిశ్రమ లోహాల అభివృద్ధిపై విస్తృతంగా పనిచేశారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్