Cancer Specialist: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:37 AM
ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు(అంకాలజిస్టు) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.
క్యాన్సర్ నివారణ, ముందస్తు చికిత్స, మెరుగైన సేవల కోసం నియామకం
ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు(అంకాలజిస్టు) డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేశారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నివారణ, ముందస్తు చికిత్స, మెరుగైన వైద్యసేవల అంశాల్లో ఆయన సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నియమాకం చేపట్టింది. డాక్టర్ దత్తాత్రేయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల స్వయంగా కలిసిన సంగతి తెలిసిందే.